పెనుబల్లి, మహా.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ పంచాయతీ పరిధిలోని జంగాల కాలనీలో ఓ భర్తపై భార్య దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికుల సమాచారం ప్రకారం 51 ఏళ్ల గంగారాం, భార్య లక్ష్మి దంపతులు గత 35 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. గంగారాం మద్యం అలవాటు వల్ల తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం లక్ష్మి భర్త పడుకున్న సమయంలో నోట్లో గుడ్డలు పెట్టి, కర్రతో తీవ్రంగా కొట్టింది.
దీంతో గంగారాం తీవ్రంగా గాయపడి బంధువుల సహాయంతో హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై గంగారాం పోలీసులకు ఫిర్యాదు చేయగా, భార్య లక్ష్మిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గంగారాం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Post Views: 26







