Mahaa Daily Exclusive

  కాకర్లపల్లి గ్రామంలోని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి * సి.పి.ఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్…!

Share

సత్తుపల్లి,ఆగస్టు24: మహా.

మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామంలో సి.పి.ఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో సమస్యలపై సర్వే నిర్వహించారు.సర్వేలో భాగంగా గ్రామానికి సమీపంగా ఎన్టీఆర్ కాలువ స్థలం నిరుపయోగంగా ఉన్నదని గుర్తించారు.ఈ సందర్భంగా సి.పి.ఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల క్రితం బేతుపల్లి చెరువు వరద ప్రవహించడానికి ఎన్టీఆర్ కాలువ తీయడం జరిగిందని,కొన్ని సంవత్సరాలు రైతుల పంట పొలాలకు నీళ్లు అందించడంలో ఎన్టీఆర్ కాలువ ఉపయోగపడిందని, ప్రస్తుతం బేతుపల్లి చెరువుకు ప్రత్యామ్నాయ కాలువ ఏర్పాటు చేయడంతో ఈ కాలువ నిరుపయోగంగా మారిందన్నారు. ప్రస్తుత ఎన్టీఆర్ కాలువ మురికి నీరుతో దుర్వాసన,దోమలు, పాములకు నిలయంగా మారిందన్నారు.కాకాకర్లపల్లి గ్రామంలో ఇంటి స్థలాలు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన వారికి ఇంటి స్థలాలు లేక ఇల్లు కట్టుకోలేకపోతున్నారన్నారు. సత్తుపల్లి పట్టణంలో విరాట్ నగర్, రేజర్ల గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ కాలువలో సింగరేణి యాజమాన్యం సహకారంతో మట్టితో నింపి స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, కల్లూరు సబ్ కలెక్టర్ తో కలిసి ఎన్టీఆర్ కాలువను పరిశీలించి కాలువ పూడ్చిన స్థలాన్ని పేద ప్రజలకు ఇళ్లస్థలాలుగా ఇస్తామని హామీ ఇచ్చారు.అదేవిధంగా కాకర్లపల్లి గ్రామంలో ఎన్టీఆర్ కాలవ వ్యాపించిన ప్రదేశాన్ని పరిశీలించి సింగరేణి యాజమాన్యంతో సంప్రదించి కాల్వను మట్టితో పూడ్చి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది.కాలనీలో మౌలిక సదుపాయాలైన సి.సి రోడ్లు, డ్రైనేజీలు,ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.ఈ కార్యక్రమంలో సి.పి.ఎం పార్టీ మండల కమిటీ సభ్యులు వేపులపాటి కుమారస్వామి, అయినంపూడి సనందరావు, బెజవాడ లక్ష్మీనారాయణ, ఆంగోతి చిట్టెమ్మ, షేక్ అఫ్జల్, బెజవాడ రామకృష్ణ, కొమరగిరి చెన్నారావు, మారేశ్వరి,షేక్ సాయి బి, అబిదా బేగం, బొమ్మ కంటే పూజిత,కోవాకుల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest