Mahaa Daily Exclusive

  జీళ్ళచెరువు గ్రామంలోని ఊర చెరువు అలుగు వద్ద గండిని పూడ్చివేత..!

Share

కూసుమంచి, ఆగస్టు 24,మహా:

కూసుమంచి మండలం, జీళ్ళచెరువు గ్రామంలోని ఊర చెరువు అలుగు వద్ద ఏర్పడిన గండిని ఇరిగేషన్ అధికారులు ఆదివారం పూడ్చివేశారు. గ్రామంలో గత పది రోజులుగా భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అలుగుకు ఉదృతంగా వరద వచ్చి పొంగిపోర్లుతున్న నేపథ్యంలో కట్ట తెగకుండ అలుగు ప్రాంతంలో జేసీబీ సహాయంతో కొంత గండిని ఏర్పాటు చేశారు. వరద ఉధృతి కారణంగా గండి పెద్దగా ఏర్పాటు కావడంతో పదిరోజూలుగా జీళ్ళచెరువు- చేగొమ్మ రహదారి నుంచి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, రైతులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరిగేషన్, పంచాయతీ అధికారులతో మాట్లాడారు. తక్షణమే స్పందించిన ఇరిగేషన్ ఈఈ రమేష్ రెడ్డి, ఏఈ శేఖర్, పంచాయతీ కార్యదర్శి రాజేష్ టిప్పర్లతో మట్టి పోసి జేసీబీ సహాయంతో పూడ్చివేశారు. దీంతో ప్రయాణికులు, రైతులు, ప్రజలు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Latest