Mahaa Daily Exclusive

  సురవరంకు ఘన నివాళులర్పించిన ఎంపీ రవిచంద్ర ..!

Share

ఖమ్మం, మహా:

భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఆయన అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న వద్దిరాజు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. స్వర్గీయ సుధాకర్ రెడ్డి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని ఆదివారం గాంధీ వైద్య కళాశాలకు అప్పగించారు. దివంగత సుధాకర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొనేందుకు గాను ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చిన ఎంపీ రవిచంద్ర గాంధీ వైద్య కళాశాల వద్ద ఆయన పార్థివదేహాన్ని సందర్శించి పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. స్వర్గీయ సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, సీపీఐ శ్రేణులను ఎంపీ వద్దిరాజు పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.

Latest