AP: తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. TTD అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.








