జూలూరుపాడు, ఆగస్టు 27, (మహా): మండల పరిధి కాకర్ల ఎంపీపీఎస్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించబడుతున్నందున ఆ పాఠశాలలో అవసరమైన టీచర్, ఆయా నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి జుంకీలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30వ తారీకు సాయంత్రం నాలుగు గంటల లోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించవలసిందిగా కోరారు. ఈ నియామకం పూర్తిగా “తాత్కాలికం” ఒక విద్య సంవత్సరంలో కేవలం 10 నెలలకు మాత్రమే పారితోషకం చెల్లించబడుతుందని తెలిపారు. టీచర్ కు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలని, ఆయాకు దరఖాస్తు చేసుకునేవారు ఏడవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. హ్యాబిటేషన్, గ్రామం, మండలం, జిల్లా వారిగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పైబడి 44 సంవత్సరాల లోపు ఉండాలని సూచించారు. నోట్ :- ఈ అవకాశం కేవలం మహిళలకు మాత్రమేనని తెలిపారు.






