Mahaa Daily Exclusive

  నగరంలో కొలువుదీరిన గణనాథులు వైభవంగా మండపాల్లో విగ్రహాల ప్రతిష్టాపన వాడవాడలా నవరాత్రోత్సవాలు ప్రారంభం..!

Share

వరంగల్ మహా;

గణపతి నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని మండలాలు అన్ని గ్రామాలతో పాటు గ్రేటర్ వరంగల్ నగరంలో పెద్ద సంఖ్య లో కమిటీలు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, వాడవాడలా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. వరంగల్ నగరంలో పలువురు ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్దకు స్థానిక నాయకులతో కలిసి వెళ్లి గణపతి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారసా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి నరేందర్ వాణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం లోని అన్ని వర్గాల ప్రజలు, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ గణేష్ గణపతి నవరాత్రులు ఎంతో వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

వరంగల్ నగరం లోని పోచమ్మ మైదాన్ పరిధిలో ఉన్న దేశాయి పేట్ రోడ్ వర్ధక సంఘం శాశ్వత అధ్యక్షుడు డాక్టర్ లయన్ ఆడెపు రవీందర్, గణపతి వర్తక సంఘం, కాశిబుగ్గ వర్తక వ్యాపార సంఘాల తోపాటు కరీమాబాద్‌, వరంగల్ చౌరస్తా పెరుకవాడ, ఎస్ఆర్ఆర్ తోట, శివనగర్, చింతల్ రంగంపేట, హనుమకొండ నగరంలో ని అంబేద్కర్ జంక్షన్, రెడ్డి కాలనీ, సుబేదారి, కొత్తూరు, ఎన్జీవోస్ కాలనీ, లలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం వాడవాడలా నిర్వాహకులు, ఆయా సంఘాలు, కమిటీలు, ఆయా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో గణపయ్య విగ్రహాలను ప్రతిష్ఠించారు. పలు చోట్ల మట్టి విగ్రహాలను కూడా పంపిణీ చేశారు. ముఖ్యంగా ఎల్లం బజార్ లో ఆకుతోట సంజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 45 ఫీట్ల భారీ గణపతి విగ్రహం నగర ప్రజలను ఆకట్టుకుంది.అలాగే
పిన్నవారి వీధి 28వ డివిజన్‌లోని పిన్నవారివీధిలో ఫ్రెండ్స్‌ యూనిట్‌ కమిటీ సభ్యులు 43 వ సంవత్సరంలో చేస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సువర్ణ కాంప్లెక్స్‌లో భారీ సెట్టింగ్ ల మధ్య వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కార్పొరేటర్‌ గందె కల్పనా-నవీన్‌ దంపతులతో పాటు కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌ యూనిట్‌ కమిటీ సభ్యులు మొదటిరోజు విగ్రహ ప్రతిష్టాపన లో భాగంగా హోమం తో పాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గందె శ్రీనాథ్‌, శ్రీకాంత్‌, పిన్న శివకుమార్‌, భార్గవరామ్‌, కల్యాణ్‌ బొగల్‌, బొడ్ల రవీంద్రనాథ్‌, వినోద్‌, విజయ్‌, అనిల్‌, నాగేందర్‌, మురళి, వేణు, సుధీర్‌, వినయ్‌, అనిల్‌, తాటికొండ రాము, పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నగరంలోని ఆయా కమిటీలు, నిర్వాహకులు మండపాల్లో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు, పూజలు వైభవంగా నిర్వహించారు.

Latest