Mahaa Daily Exclusive

  గణేష్ నిమజ్జనం లో డీజే లకు అనుమతి లేదు మిల్స్ కాలనీ పోలీస్ ఇన్స్పెక్టర్ బి రమేష్ ..!

Share

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల ప్రకారం , డిసిపి సెంట్రల్ జోన్, ఏఎస్పీ శుభం ప్రకాష్ వరంగల్ సూచనల మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న డీజే యజమానులు, ఆపరేటర్లకు డీజేల నిర్వహణ పై కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీల్స్ కాలనీ సిఐ బొల్లం రమేష్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా డీజే లకు ఎటువంటి అనుమతి లేదని, దీనిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా డీజే వాహనాలను కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిల్స్ కాలనీ ఎస్ఐ లు శ్రావణ్ , మహేశ్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Latest