TG: కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో వరద నీటి దాటికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు క్యాసంపల్లి శివారులో వరద తీవ్రతకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో నిజామాబాద్ వైపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కామారెడ్డి – ఎల్లారెడ్డి మెయిన్ రోడ్డు కోెతక గురైంది
Post Views: 27






