Mahaa Daily Exclusive

  చెన్నూరు ఎస్బిఐ-2 కేసును చేదించిన పోలీసులు –47 మందిపై కేసు నమోదు…15.237 కిలోల బంగారం, 1,61,730 కోట్ల నగదు స్వాధీనం …!

Share

మంచిర్యాల, మహా : గత ఆగస్టు 23 నాడు చెన్నూరు ఎస్బిఐ-2 బ్యాంకులో 25,17 కేజీల బంగారు ఆభరణాలు, 1,10, కోట్ల రూపాయల నగదు డిపాజిట్ల మాయం కేసును కేవలం తొమ్మిది రోజులలో చేదించి, 47 మందిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝు వెల్లడించారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, జైపూర్ ఏసిపి ఏ వెంకటేశ్వర్, తదితర పోలీస్ బృందం సమక్షంలో వెల్లడించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బిఐ-2 బ్యాంకు లో 25,17 కిలోల బంగారు ఆభరణాలు, 1,10 రూపాయల నగదు డిపాజిట్ల కనబడడం లేదని బ్యాంకు రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఆగస్టు 23 నాడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దీనితో కేసును దర్యాప్తు వేగవంతం కొరకు 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి జైపూర్ ఏసిపి రాజేశ్వర్ కు
అటాచ్ చేసినట్లు వెల్లడించారు. కాగా ఈ బృందాలు కేసును కేవలం తొమ్మిది రోజులలో ఛేదించి 15, 237 కేజీల బంగారు ఆభరణాలు,1,61,730 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని 44 మందిని అరెస్టు చేసి సెక్షన్ 318(4), 316(5), 314, 61(2)(బి), 306, 317(2) ఆర్/డబ్ల్యూ49 బి.ఎన్.ఎస్.అండ్ సెక్షన్ 65, 66(సి), 66(డి) అఫ్ ఐ టి యాక్ట్ లపై చెన్నూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అరెస్టు అయినవారిలో ప్రధాన నిందితుడు నరిగె రవీందర్ (క్యాషియర్) ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అక్టోబర్ 2024కు ముందే ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టుకుని ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం మరింత బెట్టింగ్ కొనసాగించడానికి బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కలిసి మోసానికి పాల్పడినట్లు తెలిపారు. బ్యాంక్ కరెన్సీ ఛెస్ట్ యొక్క తాళం మేనేజర్, క్యాషియర్ సంయుక్త ఆధీనంలో ఉండగా మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ తన తాళాన్ని క్యాషియర్‌కు ఇచ్చినట్లు తెలిపారు. వీరి సహకారంతో బంగారం, నగదు దొంగిలించేందుకు పథకం రూపొందించినట్లు వెల్లడించారు.
ఇలా అక్టోబర్ 2024 నుండి తరచూ గోల్డ్ లోన్ చెస్ట్ నుండి బంగారం తీసి, తన స్నేహితులకు ఆ బంగారాన్నిఇతర ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి, డబ్బును తమ ఖాతాల్లో జమ చేసి, కొంత కమిషన్ సహకరించిన వారికి ఇచ్చేవాడని ఆయన తెలిపారు. ఇప్పటివరకు నిందితులు 10 ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ కంపెనీలలో
44 మంది పేర్లపై 142 గోల్డ్ లోన్లు తీసుకున్నాడని స్పష్టం చేశారు. బంగారం తాకట్టు విషయంలో ఇతర బ్యాంకు మేనేజర్ల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో నరిగె రవీంధర్ (క్యాషియర్) వెన్నపురెడ్డి మనోహర్ (బ్రాంచ్ మేనేజర్)
లక్కాకుల సందీప్ (అటెండర్), కొంగొండి బీరేష్, కోదాటి రాజశేఖర్, బొల్లి కిషన్ కుమార్, ఉమ్మాల సురేష్, నడిగొట్టు సాగర్,రాంశెట్టి చంద్రబాబు, భరతపు రాకేష్, దిగుట్ల సునీల్, కడం రమేష్,దారపు నాగరాజు,
నిట్టూరి రాజు, కంబాల మహేష్, కంది మల్లేష్, జూపాక సత్యనారాయణ, దయ్యాల మహేందర్, ఉరుగుండ పరంధాములు, కుమ్మరి నగేష్,
మహ్మద్ రషీద్, దాడి రాజ్‌కుమార్, కన్నం రాకేష్, నేరడిగొండ అనిల్ సాయి, దుర్కి ప్రవీణ్ కుమార్, బొడ్డుపల్లి ప్రశాంత్, మంతెన రాజశేఖర్, కొమ్ము మహేష్, పంచల శశిధర్,
దుర్గం మనోహర్, ప్రభుత్వం జాకవర్ మహేష్, మహమ్మద్ హబీబ్ పాషా, జంగంపల్లి యుంగేందర్, మహమ్మద్ సమీరుద్దీన్, మోతుకూరి శ్రీనివాస్, తాళ్లండి అనాజయ్య, నిమ్మతి సుమ, పాణి రవళిఖా,
ఈసంపల్లి సాయికిరణ్,
నరిగె స్వర్ణలత, గౌడ సుమన్,
తుండ్ల సురేష్, జుర్రు శ్రీనివాస్, తుంగపిండి శేఖర్,నరిగె సరిత,
మోతుకూరి రమ్య, అగిడి మొగిలి ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును తక్కువ కాలంలోనే చాకచక్యంగా ఛేదించిన చెన్నూరు సిఐ దేవేందర్ రావు, రూరల్ సీఐ ఆర్. బన్సీలాల్, శ్రీరాంపూర్ సీఐ డి వేను చందర్ తదితరులను ఆయన అభినందించారు.

Latest