తల్లాడ, ఆగస్టు, 31, (మహా )
తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వరసిద్ధి వినాయక విగ్రహాన్ని గ్రామ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం విగ్రహం వద్ద గ్రామ మాజీ సర్పంచ్ తూము శ్రీనివాసరావు దంపతులు పీటలపై కూర్చొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంగాదేవిపాడు సొసైటీ చైర్మన్ తూము వీరభద్రరావు, సరస్వతి దంపతులు హాజరయ్యారు. వారు గణపయ్యకు పూజలు నిర్వహించి అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో మహిళలందరూ హాజరై గణపయ్యకు పూజా కార్యక్రమాలు చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలతో తులతూగాలని లంబోదరుడిని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు కళ్యాణపు కృష్ణయ్య, కళ్యాణపు వెంకటయ్య, నాయుడు శ్రీనివాసరావు, శెట్టిపల్లి లక్ష్మణరావు, కళ్యాణపు పెద్ద సత్యం, చెరుకూరి గోపాలరావు, చేడే వెంకన్న, విలాసారపు రాములు, గుర్రం రామారావు, నాయుడు చిన్న అప్పారావు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






