Mahaa Daily Exclusive

  వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి – కలెక్టర్ అభిలాష అభినవ్..!

Share

నిర్మ‌ల్ మ‌హా : వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్మ‌ల్ జిల్లా భైంసా పట్టణంలోని మున్నూరుకాపు ఫంక్షన్ హాల్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణేష్ నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు చేపట్టామ‌ని తెలిపారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరగాలని ఆకాంక్షించారు. గడ్డెన్న వాగు పరిసరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్, భైంసా సబ్ కలెక్టర్లను సన్మానించారు. అనంతరం పట్టణంలోని పలు మండపాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు.అనంతరం తానూరు మండలం బోసి గ్రామంలోని వరసిద్ధి వినాయక ఆలయంలో జిల్లా కలెక్టర్, అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు శాలువాలతో సత్కరించి వినాయకుని చిత్రపటాలను బహుమతిగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, ఏఎస్పీ అవినాష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ షిండే ఆనంద్ రావు పటేల్, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Latest