మంచిర్యాల, మహా, (సెప్టెంబర్-4 ) : మంచిర్యాల
జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు. గురువారం సాధారణ తనిఖీలలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల ఈ.వి.ఎం. గోదామును జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి చంద్రయ్య, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈ.వి.ఎం. గోదాము వద్ద భద్రత సిబ్బందితో పటిష్టమైన చర్యలకు ఆ ప్రాంగణంలో సి. సి. కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఈ పర్యవేక్షణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రామచందర్, సంబంధిత అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 10






