భూపాలపల్లి, మహా :
జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జయశంకర్ భూపాలపల్లి ఆధ్వర్యంలో
సెప్టెంబర్, 13 వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ సి.హెచ్.రమేష్ బాబు గారు తెలిపారు. గురువారం న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌరవనీయులు జడ్జి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్, సివిల్, వివాహ /కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ ఆక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను మరియు రాజీ పడదగు ఇతర కేసులు పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కోర్టులలో పెండింగ్ లో ఉన్న తమ తమ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించుకొని లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని కోరారు. కోర్టులలో లేని కేసులను ప్రీ- లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థ లో పరిష్కరించుకోవాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని, ఎక్కువ కేసులు పరిష్కరించుటకు న్యాయవాదులు కృషికి చేయాలనీ వారు సూచించారు.
ఈ సందర్బంగా జాతీయ లోక్ అదాలత్ పోస్టర్ ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఏ.నాగరాజ్ , ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల , అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు, పోక్సో కోర్టు స్పెషల్ పి.పి. ఎన్. విష్ణువర్ధన్ రావు, సీనియర్ న్యాయవాదులు పి.ఆనంద రావు, సంగేమ్ రవీందర్, ఎం.రాజ్ కుమార్, జి. ప్రియాంక, ఎం.రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






