Mahaa Daily Exclusive

  భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ కిరణ్ ఖరే వినాయకుడి పూజ..!

Share

భూపాలపల్లి, మహా :
భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో గురువారం గణేశుడి కి ఎస్పీ కిరణ్ ఖరే పూజలు చేశారు.
పూజా కార్యక్రమంలో భూపాలపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, కుటుంబ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల తో జిల్లాలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఇలాంటి పండుగలు పోలీసు సిబ్బందికి ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగించడంతో పాటు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.
కార్యక్రమంలో డిఎస్పి సంపత్ రావు, సిఐ నరేష్, ఎస్ఐలు, సిబ్బంది అందరూ పాల్గొని పూజలో భాగస్వాములయ్యారు.

Latest