వరంగల్ మహా;
నల్లగొండ జిల్లా దామెర చర్ల ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ తన లారీలో సిమెంట్ బస్తాలను స్థానిక వేలేరు మండలంలోని పిసర గ్రామంలో అన్లోడ్ చేసి వస్తున్న క్రమంలో లారీ నడుపుతున్న సమయంలోనే మల్లి కూడుర్ల గ్రామం వద్ద సదరు లారీ డ్రైవర్ శ్రీనివాస్ కు గుండెపోటు తో లారీలోనే మరణించాడు. సమాచారం అందుకున్న వేలేరు ఎస్ఐ సురేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి వెళ్లి లారీలో విగత జీవిగా పడి ఉన్న శ్రీనివాస్ మృతదేహాన్ని తన సిబ్బంది స్థానికుల సహాయంతో లారీ నుండి బయటకు తీసి డీసీఎం వ్యాన్ లోకి ఎక్కించారు. వేంటనే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి డ్రైవర్ మృతదేహాన్ని యం జి యం కు తరలించారు. ఈ సంఘటన పై
వేలేరు ఎస్సై సురేష్ కుమార్ వేగంగా స్పందించిన తీరు మృతదేహాన్ని లారీ నుండి వ్యాన్ లోకి ఎక్కిచడంలో ఎస్ఐ యే స్వయంగా పాల్గొనడం పట్ల స్థానికుల హర్షం వ్యక్తంచేశారు.
Post Views: 30






