Mahaa Daily Exclusive

  పత్తికుంట చెరువును సందర్శించిన, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి…!

Share

రాజేంద్రనగర్ మహా ; గణేష్‌ నవరాత్రులో భాగంగా తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణేశ్ నిమజ్జనానికి పత్తి కుంట చెరువు సిద్ధమైంది.రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని‌ పత్తి కుంట చెరువును అడిషనల్ డిసిపి శ్రీనివాసరావు, డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తో కలిసి గురువారం సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సందర్శించారు. కొద్దిసేపు నిమజ్జనం జరుగుతున్న తీరు పరిశీలించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎసిపి శ్రీనివాస్, సిఐ , రాజేంద్రనగర్ గణేశ ఉత్సవ సమితి సభ్యులు వై శ్రీధర్, బాల్రెడ్డి, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Latest