Mahaa Daily Exclusive

  దేశంలోనే రేవంత్ రెడ్డి సర్కారు ఆదర్శనీయం రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ తాడిపత్రి గ్రామం మాజీ సర్పంచ్ దోస రమేష్..!

Share

రంగారెడ్డి జిల్లా మహా:
ప్రజా పాలన పేదల కోసం అని మరొక్కసారి గుర్తు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని దూస రమేష్ అన్నారు. యాచారం మండలం తాడిపర్తి గ్రామం నూతనంగా వచ్చిన రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న, గ్రామ మాజీ సర్పంచ్ దూస రమేష్. ఆయన మాట్లాడుతూ… గత సర్కారులో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి, ఎన్ని దరఖాస్తులు పెట్టినా, రోడ్లెక్కి ధర్నాలు చేసిన, రేషన్ కార్డు రాలేదు, కానీ ఈ రోజు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రత్యేక చొరవతో అర్హులందరికీ రేషన్ కార్డులు రావడం, సంతోషకరమైన చేయమని అన్నారు. ప్రజా పాలన పేదల కోసం అని మరొక్కసారి గుర్తు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, దేశంలోనే రేవంత్ రెడ్డి సర్కారు ఆదర్శనీయం అని, మాజీ సర్పంచ్ దూస రమేష్ కొనియాడారు. ఒక సర్పంచిగా పనిచేసిన నాకు, ప్రజలకు రేషన్ కార్డు కావాలి అని ఎన్ని ధర్నాలు చేసిన రాలేదు, కానీ ఈ ప్రజా ప్రభుత్వం రాగానే పేదలకు రేషన్ కార్డు, సన్న బియ్యం ఇవ్వడం, ప్రజా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని మరొక్కసారి రుజువైందని అన్నారు..

Latest