Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ పార్టీలో చేరికలు పార్టీ లో చేరిన రిటైర్డ్ ఎమ్ఈఓ కండువా క‌ప్పి స్వాగతించిన కంది శ్రీనివాస రెడ్డి..!

Share

ఆదిలాబాద్ మ‌హా: ప‌ట్ట‌ణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయ‌కులు రాచర్ల శరత్, భగత్ నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు మ‌హ్మ‌ద్ అలీ షబ్బీర్ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి షబ్బీర్ అలీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీ లోకి స్వాగతించారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు ,ప్ర‌జాపాల‌న చూసి పార్టీలో చేరిన‌ట్టు వారు తెలిపారు.అనంత‌రం పట్టణం లోని 46వ‌వార్డు చోట తలాబ్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఎంఈఓ కోలా నర్సింలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయ‌న నివాసంలో పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో బోథ్ ఇంచార్జి ఆడెగ‌జేంద‌ర్ ,గ్రంథాల‌య చైర్మన్ మ‌ల్లెపూల న‌ర్స‌య్య‌, గోక గ‌ణేష్ రెడ్డి , గిమ్మ సంతోష్ రావు, బండారి సతీష్, కలాల శ్రీనివాస్, దేవిదాస్ చారి,కొండా గంగాధర్,లోక‌ప్ర‌వీణ్ రెడ్డి ,ప‌త్తిముజ్జు, డేరా కృష్ణారెడ్డి ,మానె శంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest