Mahaa Daily Exclusive

  ప్రజాపాల‌న‌లో ప్ర‌జ‌లే మూలం- ష‌బ్బీర్ అలీ..!

Share

ఆదిలాబాద్ మ‌హా : ప్ర‌జాపాల‌న‌లో ప్ర‌జ‌లే ప్ర‌భుత్వానికి మూల‌మ‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ ఓబీసీ మైనార్టీల శాఖల సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. బుధ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని క‌లెక్ట‌రేట్ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన తెలంగాణ ప్ర‌జాపాల‌నా దినోత్స‌వ సంబ‌రాల‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. తెలంగాణ అమ‌రుల స్మార‌క స్తూపం వ‌ద్ద పూలు చ‌ల్లి అమ‌రుల‌కు నివాళ్లు అర్పిచారు. పోలీసులు గౌరవ‌ వంద‌నం అనంత‌రం జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం జ‌రిగిన స‌మావేశంలో జిల్లా ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. ముందుగా జిల్లా ప్ర‌జ‌ల‌కు తెలంగాణ ప్ర‌జాపాల‌నా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. 1948లో నిజాంపాల‌న ముగిసి ప్ర‌జాస్వామ్య పాల‌న సాగింద‌ని అనంత‌రం ద‌శాబ్దం క్రితం సోనియా గాంధీ చొర‌వ‌ వ‌ల్ల ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌న్నారు. కొత్త రాష్ట్రంలో ప‌దేళ్ల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఏర్ప‌డ్డ కొత్త ప్ర‌భుత్వం ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి సార‌ధ్యంలో అస‌లైన ప్ర‌జాపాల‌న న‌డుస్తుంద‌న్నారు. అందుకే ప్ర‌జాపాల‌నా దినోత్స‌వ సంబ‌రాలు జ‌రుపుకుంటున్నామ‌న్నారు.తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కిచ్చిన అన్ని హామీలు అమ‌లు ప‌రిచింద‌న్నారు. ఆరుగ్యారెంటీలతో అద్భుతాలు సృష్టించిద‌న్నారు. ఎక్క‌డాలేని విధంగా పేద‌ల‌కు స‌న్న‌బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్ర ప్ర‌భ‌త్వం త‌మ‌ద‌న్నారు. ఇందిర‌మ్మ ఇండ్ల ద్వారా పేద‌ల సొంతింటి క‌ల సాకార‌మై వారి క‌ళ్లల్లో ఆనందం క‌న‌ప‌డుతుంద‌న్నారు. ఎన్నోఏళ్లుగా కొత్త రేష‌న్ కార్డుల కోసం, కొత్త పేర్లు చేర్చ‌డం కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూసిన‌వారికి త‌మ ప్ర‌భుత్వం కార్డులందించిద‌న్నారు.రైతుభ‌రోసా రైతు రుణ‌మాఫీ లాంటి ఎన్నో ప‌థ‌కాల‌తో రైత‌న్న‌ల ప‌క్షాన నిలిచింద‌న్నారు. ప్ర‌భుత్వ మేర్ప‌డ్డ త‌ర్వాత ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా అభివృద్దే ధ్యేయంగా ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌న్నారు. చెప్పినట్టుగానే ఇంద్ర‌వ‌ల్లిలో అమ‌ర‌వీరుల స్మృతివ‌నాన్ని ప్రారంభించామ‌న్నారు.
జిల్లాలో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంతో ప్ర‌జార‌వాణాసంస్థ‌కు 87కోట్ల‌కు పైగా చెల్లించి ఆర్థిక లోటు నుండి నిల‌బెట్టామ‌న్నారు. గృహ జ్యోతి ప‌థ‌కం కింద 55కోట్ల‌కు పైగా నిధులు వెచ్చించామ‌న్.. జిల్లాకు రైతుభ‌రోసా
కింద 329.77 కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మ చేసామ‌న్నారు. రైతుల‌కు ఇప్ప‌టివ‌ర‌కు 77వేల 224మెట్రిక్ ట‌న్నుల ఎరువుల‌ను అందించామ‌ని ఇంకా స‌రిప‌డా ఎరువులు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు.
పీవీటీజీ ఎస్టీల‌కు క‌లిపి 15 వేల 402 ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరుకాగా 7573 మార్క‌ట్ చేయ‌బ‌డి 5096 ఇండ్లు నిర్మాణ ద‌శల్లో ఉన్నాయ‌న్నారు.ఇటీవ‌లే జిల్లా ఇంచార్జి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు చేతుల మీదుగా ప‌లు గృహ‌ప్ర‌వేశాలు జ‌రిగాయ‌న్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 25వేల మందికి పైగా సేవ‌లు వినియోగించుకుంటే
60.89కోట్లు రూపాయ‌లు ప్ర‌భుత్వం వెచ్చింద‌న్నారు.23కోట్ల‌తో రిమ్స్ లో క్రిటిక‌ల్ కేర్ యూనిట్ పూర్తై ప్రారంభానికి సి్దంగా ఉంద‌న్నారు. క‌ళ్యాణ ల‌క్ష్మి షాదీ ముబార‌క్ కింద 41వేల 589 కుటుంబాల‌కు 388. 75 కోట్లు వెచ్చించామ‌ని తెలిపారు.2047 నాటికి తెలంగాణ రైజింగ్ పేరుతో భార‌త దేశ ముఖ‌చిత్రంపై తెలంగాణ కీల‌కంగా ఉండాల‌న్న సంక‌ల్పంతో ప్ర‌భుత్వం ముందుకు సాగుతుంద‌న్నారు. 3ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్వ‌వ‌స్థ‌గా మార్చే ల‌క్ష్యంగా తెలంగాణ రైజింగ్ వైపు సాగుతున్నామ‌న్నారు. ఇది కేవ‌లం ప్ర‌ణాళిక కాద‌ని ప్ర‌పంచ వేదిక‌పై తెలంగాణ రాష్ట్రాన్ని స‌గ‌ర్వంగా నిల‌బెట్టే మ‌హ‌త్త‌ర సంక‌ల్ప‌మ‌న్నారు.
ఇందులో అంద‌రి భాగ‌స్వామ్యం అవ‌స‌ర‌మ‌న్నారు. మ‌రోమారు ప్ర‌జ‌లంద‌రికి తెలంగాణ ప్ర‌జాపాల‌నా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ గొడం న‌గేష్, జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ మ‌ల్లెపూల న‌ర్స‌య్య‌,జిల్లా క‌లెక్ట‌ర్ రాజ‌ర్షిషా, ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్, అడిష‌న‌ల్ కలెక్ట‌ర్ శ్యామ‌లాదేవి,ట్రైనీ క‌లెక్ట‌ర్ స‌లోనీ చాబ్రా, డీఎఫ్ఓ ప్ర‌శాంత్ బాజీరావు పాటిల్ , జైన‌థ్ వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ అల్లూరి అశోక్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest