Mahaa Daily Exclusive

  నాణ్యతతో రోడ్లు కట్టాలి: మంత్రి ఉత్తమ్

Share

TG: రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని, లేదంటే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం గరిడేపల్లి మండలం గానుగబండ, కల్మలచెరువు గ్రామాల్లో రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నేరేడుచర్ల పట్టణంలో రూ.41.25 లక్షలతో సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. హుజూర్ నగర్ లో రూ.2 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు.

Latest