బెల్లంపల్లి ,మహ: బెల్లంపల్లి ఆడపడు
చులు విదేశాల్లో బతుకమ్మ రీలు చేసి మొదటి బహుమతి పొందిన సంఘట
న చోటుచేసుకుంది.బెల్లంపల్లి పట్ట
ణానికి చెందిన మహిళలు అమెరికా దేశంలో స్థిరపడినప్పటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఆలవా
లంగా నిలిచే బతుకమ్మ సద్దుల వేడుక
లను ఘనంగా నిర్వహించడంతో మొదటి బహుమతి సాధించడం విశే
షం. బెల్లంపల్లి పట్టణానికి చెందిన
ఆవులస్రవంతి,రామగోనిస్రవంతి,బుర్ర ఉమామహేశ్వర్ లు ప్రత్యేక రీతిలో సద్దుల బతుకమ్మను పేర్చి బహుమతి సాధించడంతో తెలంగాణణ డెవలప్ మెంట్ ఫోరం డిసీ వ్యవస్థాపక అధ్య
క్షురాలు కవిత చల్ల చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ సం
దర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా, ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో తెలంగాణ ఆడపడుచులు, సంవత్స
రానికి ఒకసారి ఆడుకునే బతుకమ్మ ఆటకు, తెలంగాణలోనే కాకుండా విదేశాల్లోనూ ఆదరణ ఉందని తెలం
గాణ డెవలప్మెంట్ ఫోరం డిసి 25 వ వార్షికోత్సవం సందర్భంగా వాషింగ్టన్ డిసి వర్జినీయాలో ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.20 వ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బెల్లంపల్లికి చెందిన ఆవుల స్రవంతి,రామగోనిస్రవంతి,బుర్ర ఉమామహేశ్వరి బతుకమ్మ ఆటా
పాటల్లో పాల్గొని మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ప్రముఖ గాయ
ని కె ఎస్ చైత్ర, హాజరు కాగా టి డి ఎఫ్ డి సి వ్యవస్థాపక అధ్యక్షురాలు, కవితా చల్ల, చేతుల మీదుగా మొదటి బహుమతి అందుకున్నారు.






