Mahaa Daily Exclusive

  త్వరగా రిప్లై ఇవ్వండి.. యుద్ధాన్ని ఆపకపోతే విషాదాంతమే హమాస్‌కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ అల్టిమేటం..!

Share

ఇంటర్నెట్ డెస్క్, మహా: గాజాలో యుద్ధం ముగింపునకు తాము సూచించిన శాంతి ఫార్ములాపై హమాస్‌ స్పందన తెలియజేసేందుకు మూడు, నాలుగు రోజులు గడువు ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. లేదంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ ఒప్పందానికి అంగీకరించకుంటే ముగింపు విషాదంగా ఉంటుందని హెచ్చరించారు. ఇదే అంశంపై వైట్‌హౌస్‌ బయట మీడియాతో మాట్లాడారు. ‘ఈ ప్రతిపాదనపై భాగస్వామ్య పక్షాలన్నీ స్పందించాయి. ఇజ్రాయెల్‌ సహా అరబ్‌ దేశాలు అంగీకరించాయి. ముస్లిం దేశాలు కూడా ఓకే చెప్పాయి. హమాస్‌ స్పందన కోసం వేచి చూస్తున్నాం. వారు అంగీకరిస్తారో లేదో తెలియదు. మూడు-నాలుగు రోజులు వేచి చూద్దాం. ఒకవేళ అంగీకరించకుంటే ముగింపు చాలా విషాదంగా ఉంటుంది. ఇజ్రాయెల్‌ ఏం చేయాలో అది చేస్తుంది’ అని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. కాల్పుల విరమణగా పేర్కొంటున్న ఈ శాంతి ఒప్పందం ప్రకారం.. 72 గంటల్లో బందీలను హమాస్‌ విడిచిపెట్టాలి. ఇజ్రాయెల్ కూడా క్రమంగా గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకునేలా ప్రతిపాదనలు చేశారు. అయితే, దీనిపై హమాస్‌ చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయ, సైనిక నాయకత్వంతో సంప్రదింపులు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.

Latest