హైదరాబాద్, మహా: ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుతంగా ఆడి భారత్‌ను విజయ తీరాలకు తీసుకెళ్లిన యువ క్రికెటర్ తిలక్ వర్మ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తిలక్‌ను.. సీఎం సత్కరించి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ విశేషాలతో పాటు తిలక్ గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. తిలక్‌ను ప్రోత్సహిస్తూ వచ్చిన కోచ్‌ను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తిలక్ వర్మ క్రికెట్ బ్యాట్‌ను బహూకరించారు. ఆసియా కప్ ఫైనల్ లో.. ఇండియా కష్టాల్లో ఉందనుకున్న సమయానికి తిలక్ వర్మ ఆదుకుని అద్భుత విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు.. టాప్ ఆర్డర్ వెంట వెటనే పెవిలియన్ బాట పట్టడంతో మ్యాచ్ భారాన్ని తన భుజాలపై వేసుకుని 53 బంతుల్లో 69 రన్స్ చేసి స్టన్నింగ్ విక్టరీ ఇచ్చాడు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.






