Mahaa Daily Exclusive

  సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడే జరగవు దసరాకు దావత్‌లు ఇవ్వకండి.. డబ్బు ఖర్చు చేసుకోకండి =బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్..!

Share

హైదరాబాద్, మహా: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హాట్ కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చంటూ వ్యాఖ్యానించారు. సర్పంచ్‌ అభ్యర్థులు తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టొద్దంటూ సూచించారు. ‘‘తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండి. లీగల్‌గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ హెచ్చరించారు. బీసీలకు 42 శాతం కోటా పేరుతో రేవంత్‌ సర్కార్‌ డ్రామా ఆడుతోందని ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితేంటి?. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగాక కోర్టు రద్దు చేసిందన్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని అంటూ ఈటల గుర్తు చేశారు.

ముగ్గురు మంత్రులు అలా చెబుతున్నారు..
ఎవరిని మోసం చేయడం కోసం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కోర్టులో చెల్లదని తెలిసికూడా బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ ప్రకటించి.. గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. బిహార్‌, మహారాష్ట్రలో రిజర్వేషన్లపై నమోదైన పలు కేసులను సుప్రీం కోర్టు కోట్టివేసిందన్నారు. ఎవరూ కోర్టుకు వెళ్లొద్దని ముగ్గురు మంత్రులు చెబుతున్నారని గుర్తు చేశారు. ‘కోర్టుకు వెళ్తే అభ్యంతరం ఏంటని నేను ప్రశ్నిస్తున్నా. ఎన్నికల్లో ఓటు కోసం డబ్బులు ఖర్చుపెట్టొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. నల్గొండ జిల్లాలోని గిరిజన తండాల్లో బీసీలు లేకున్నా.. రిజర్వేషన్‌ ప్రకటించారు. మా పార్టీ తరఫున శాసనసభలో, కౌన్సిల్‌లో పూర్తి మద్దతిచ్చాం. అనుభవం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. మా మీద అనవసరంగా బురద చల్లొద్దు’ అని ఈటల అన్నారు.

Latest