Mahaa Daily Exclusive

  బీసీ బిల్లు ఆపుతుంది బీజేపీ, బీఆర్ఎస్సే..

Share

  • దుష్టులు, దుర్మార్గులు అడ్డుకున్నా పక్కాగా సర్వే చేశాం
  • రెండు పార్టీలు కలిసి బీసీల నోటికాడి ముద్ద లాక్కున్నాయి: భట్టి ఫైర్
  • బీసీల రిజర్వేషన్ల పెంపు బీజేపీ, బీఆర్ఎస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు: టీపీసీసీ చీఫ్
  • ఎట్టి పరిస్థితుల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్న మహేశ్ కుమార్ గౌడ్

 

హైదరాబాద్, మహా: బీసీ రిజర్వేషన్‌ బిల్లు ఆపడంలో బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర స్పష్టంగా కనిపించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా?, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేసింది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఆ రెండు పార్టీల కుట్ర స్పష్టంగా కనబడుతుందని ఫైర్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ చేసిన చట్టమే బీసీలకు ఉరితాడుగా మారిందన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చట్టం తెచ్చింది కేసీఆరేనన్నారు. గురువారం గాంధీ భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇతర ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘42 రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం… తెలంగాణ మోడల్ దేశం మొత్తం అమలు చేసేలా మా కార్యాచరణ ఉంటుంది. ఢిల్లీలో మేమంతా ధర్నా చేసిన రోజు బీఆర్ఎస్ నేతలు అంతా ఎక్కడ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కు చట్టబద్ధంగా చేయవలసిన పక్రియ అంతా ప్రభుత్వం చేసింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికల పక్రియ మొదలు పెట్టాలని కోర్టు ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు పెంచే ఆలోచన గత బీఆర్ఎస్ ప్రభుత్వంకు ఉంటె ఎందుకు కులగణన చేయలేదు. బీసీలు అమాయకులు కాదు…బీసీ రిజర్వేషన్ల పెంపు ఎంత కఠినమైనదో తెలుసు. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీసీ రిజర్వేషన్ల పెంపు పక్రియ చేపట్టాం’ అని తెలిపారు.

 

బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారు..

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోర్టులను, చట్టాలను నమ్ముతుందని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, బీసీల రిజర్వేషన్ల పెంపు బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. 95 సంవత్సరాల తర్వాత బీసీ కులగణన జరిగిందని, బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీసీలను బీఆర్ఎస్ మోసం చేసిందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం తో బీసీల నోటి కాడి ముద్ద లాక్కున్నారని, తాము ఢిల్లీలో ధర్నా చేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. బీఆర్ఎస్ కాబ్ లిమిట్ పెడుతూ చట్టం చేసి అడుగడుగున బీసీలను అణగదొక్కిందని ఫైర్ అయ్యారు.

 

చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు..

తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి ఆదిశగా ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు జరగాల్సి ఉన్న రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. సీఎం రేవంత్, కేబినెట్ మంత్రులు, పార్టీ అంత ఢిల్లీ వెళ్లి ధర్నా చేశామని.. బీసీ సంఘాలు కుల సంఘాలు ధర్నా చేస్తే బీజేపీ, బీజేపీ లు ఎందుకు చేయలేదని నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని అన్నారు. తాము డిల్లీలో పోరాడినప్పుడు మీరు ఎక్కడ తోక ముడుచుకొని తలదాచుకున్నారు? అని నిలదీశారు. కోర్టులో పోరాటం చేస్తుంటే ఎందుకు మీరు ఇంప్లీడ్ కాలేదు. బీసీలకు వ్యతిరేకంగా ఉన్న మీరు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు అని మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు.

=============