Mahaa Daily Exclusive

  రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు పలుకుతోంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు..

Share

  • బిల్లుకు 3 నెలల టైం ఉన్నది.. ఎందుకు తొందర పడుతున్నారు
  •  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

 

హైదరాబాద్, మహా: బీసీ రిజర్వేషన్లపై స్టే రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు పలుకుతోందని స్పష్టం చేశారు. బీసీల అంశాని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని విమర్శించారు. గవర్నర్‌కి పంపిన తర్వాత బిల్లు కోసం 3 నెలల సమయం ఉంది.. ఎందుకు తొందర పడుతునారని సూచించారు. బిల్లు ఆమోదానికి 3 నెలల సమయం ఉండగా ఎందుకు బిల్లు తెచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందని రామ్‌చందర్ రావు నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టే.. ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందని మాట్లాడుతారు తప్ప.. కనీసం రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ నేతలు మైండ్ అప్లై చేశారా.. అని ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిన బాధ్యత మీది. ఆర్డినెన్సు తెచ్చింది మీరు.. బిల్లు తెచ్చింది మీరు.. కానీ బీజేపీనీ అంటునారని రామచందర్ మండిపడ్డారు.