హైదరాబాద్, మహా : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీసీలకు చోటు లేదు.. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్యం అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ నినాదం చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా.. ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా.. భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారన్నారు. కానీ రాష్ట్రంలో ఉప ఎన్నికలు కానీ వస్తే బీసీలనే మర్చిపోతారని ఫైర్ అయ్యారు. బీసీలు తెలంగాణ బీజేపీలో ఎక్కడున్నారో చెప్తారా అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. గతంలో తానెప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదని.. హిందూత్వం గురించి మాత్రమే మాట్లాడానని గుర్తు చేశారు. కానీ మొదటిసారి ఇలా మాట్లాడటానికి కారణం ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల్లో బీసీ కార్డును ప్లే చేసి బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని సర్వనాశనం చేసేందుకు
దీపక్ రెడ్డికి అభినందనలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ లంకల దీపక్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. దీపక్ రెడ్డి విజయం సాధించాలని రాజాసింగ్ ఆకాంక్షించారు








