Mahaa Daily Exclusive

  బీసీ బంద్‌కు మంత్రి కొండా సురేఖ మద్దతు: సికింద్రాబాద్‌లో నిరసన, 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్!

Share

హైదరాబాద్, మహా:42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్‌ చేపట్టాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ బంద్‌కు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్‌లో నిరసన చేపట్టారు. బీసీలకు వెంటనే న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Latest