- ప్రజల ఆశయాలను నెరవేర్చేది కాంగ్రెస్సే
- కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
- డోర్ టు డోర్ కంపైనింగ్.. భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలు
హైదరాబాద్, మహా: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆశయాలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీదే అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ మధురానగర్ ప్రాంతంలో నవీన్ యాదవ్ డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులను.. సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే ప్రజల సమస్యలను వినిపించి, వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీదే అని, అభివృద్ధి, సంక్షేమం అందించే చేతి గుర్తుకు మీ విలువైన ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు








