Mahaa Daily Exclusive

  ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా కల్కి…

Share

  • ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా కల్కి
  • మరో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు
  • కృతి సనన్ కు ఉత్తమ నటి అవార్డు

ముంబై, మహా
కల్కి మరో అరుదైన ఘనత సాధించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు2025 వేడుకలు ముంబైలో అట్టహాసంగా జరిగాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఈ ఏడాది ‘ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. హిందీ చిత్ర పరిశ్రమలో ‘చందు ఛాంపియన్’ సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్న నటుడు కార్తిక్ ఆర్యన్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. అదే విధంగా తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి సనన్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.

దాదాసాహెబ్ ఫాల్కే ఫాల్కే ఇంటర్నేషనల్‌ అవార్డ్స్ – 2025 విజేతలు వీరే..
ఉత్తమ చిత్రం: స్త్రీ 2
ఉత్తమ నటుడు: కార్తీక్ ఆర్యన్
ఉత్తమ నటి: కృతి సనన్
ఉత్తమ దర్శకుడు: కబీర్ ఖాన్ (చందు ఛాంపియన్)
బెస్ట్ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌: కల్కి 2898 ఏడీ
ప్రొడ్యూసర్ ఆఫ్‌ ది ఇయర్‌: దినేష్ విజన్
బెస్ట్ మూవీ క్రిటిక్స్: లాపతా లేడీస్
బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్: విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)
బెస్ట్‌ యాక్ట్రెస్‌ క్రిటిక్స్‌: నితాన్షీ గోయెల్‌
బెస్ట్‌ వెబ్‌సిరీస్‌: హీరామండి
బెస్ట్‌ యాక్టర్‌ (వెబ్‌సిరీస్‌): జితేంద్ర కుమార్‌
బెస్ట్‌ యాక్ట్రెస్‌ (వెబ్‌సిరీస్‌): హ్యుమా ఖురేషి
ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా: శిల్పాశెట్టి
ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఏఆర్‌ రెహమాన్‌
అవుట్‌స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ: జీనత్‌ అమన్‌
అవుట్‌స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ: ఉషా ఉతుప్‌
….

Latest