Mahaa Daily Exclusive

  కుషాయిగూడలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య…

Share

  • డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి
  • కుషాయిగూడలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

హైదరాబాద్, మహా : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఆటో డ్రైవర్ పోలీసుస్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన మల్కాజిగిరి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న సింగిరెడ్డి మీన్ రెడ్డి (32) డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. దీంతో పోలీసులు ఆటోను పోలీసుస్టే,న్ కు తరలించారు. దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డి ఆటోను వదిలేయాలంటూ రాత్రి పొద్దుపోయేంత వరకు పోలీసులను వేడుకున్నాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుటే మీన్ రెడ్డి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలను ఆర్పడానికి స్థానికులు ప్రయత్నించినప్పటికీ మీన్ రెడ్డి 90 శాతం కాలినగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం గాంధీ తరలించగా అక్కడ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మల్కాజ్ గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Latest