- ప్రభుత్వ సలహాదారుగా పి.సుదర్శన్ రెడ్డి బాధ్యతలు
- శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
- హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మండలి ఛైర్మన్ గుత్తా, తదితరులు
హైదరాబాద్, మహా: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పి. సుదర్శన్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం సుదర్శన్ రెడ్డికి సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఛాంబర్ కేటాయించింది. తన ఛాంబర్‌లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అలాగే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ హృదయపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సెక్రటేరియట్‌లోని వారి కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందించి, అభినందనలు తెలియజేశారు
Post Views: 27








