Mahaa Daily Exclusive

  అబద్దాలతో సీఎం రేవంత్ టైంపాస్….

Share

  • అబద్దాలతో సీఎం రేవంత్ టైంపాస్
  • ఉప ఎన్నిక సీఎం మెడ మీద కత్తిలా వేలాడుతోంది
  • ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి కావాలని ఎక్కడుంది?
  • కేసీఆర్ అవినీతి కక్కిస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిందేవరు?
  • బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా: కేటీఆర్ అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి తీరు ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేశారు. పార్ములా ఈ కేసులో కేటీఆర్‍ను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి కోరి 2 నెలలైనా స్పందన లేదని, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‍లో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. కేసీఆర్ కుటుంబ సభ్యులను అరెస్టు చేయవద్దని ఏఐసీసీ పెద్దలు చేసిన సూచన మేరకే వారిని అరెస్టు చేయకుండా అబద్ధాలతో టైమ్ పాస్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్‍ను ముందు రిమాండ్ చేయాలని ఆ తర్వాత కోర్టులో చూసుకుంటాయన్నారు. కేసీఆర్ కుటుబం అవినీతిపై ఆధారాలు ఉన్నాక గవర్నర్ అనుమతి పంచాయితీ ఎందుకొచ్చిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి కావాలని ఎక్కడుంది? ఈ దేశం, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే అరెస్టు కాలేదా? గత బీఆర్ఎస్ పాలనలో మిమ్మల్ని రెండు సార్లు అరెస్టు చేశారు. నాడు కేసీఆర్ ఎవరి అనుమతి తీసుకుని అరెస్టు చేశారని సీఎంను ప్రశ్నించారు.

కేసీఆర్ కుటుంబం అవినీతిని కక్కిస్తామని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చిన 23 నెలల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీని ప్రశ్నిస్తున్నారని రఘునందన్ రావు నిలదీశారు. ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హడావుడిగా అసెంబ్లీలో పెట్టి ఈ కేసును సీబీఐకి పంపితే దీనిపై కేసీఆర్, హరీశ్ రావు, మాజీ సీఎస్ ఎస్.కే జోష్, స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని దాంతో వీరందరిపై సీబీఐ విచారణ ఆపాలని హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. మరో రెండు వారాల్లో ఏజీతో కౌంటర్ వేయాలని చెబితే ఇప్పటి వరకు కౌంటర్ వేయించలేదన్నారు. ఏసీబీ కేసులో అరెస్టు చేయించడం చేతకావడం లేదన్నారు. అరెస్టులు చేస్తే ప్రజలు బీఆర్ఎస్‍పై సింపతి చూపుతారేమోనన్న భయంతో అరెస్టు చేయకుండా బీజేపీని ఎందుకు విమర్శిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబం అవినీతిపై ప్రధానికో, కేంద్ర హోంశాఖ మంత్రికో ఫిర్యాదు చేశారా అని మండిపడ్డారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి మెడమీద కత్తిలా వేలాడుతోందని, అందుకే ఆ భయంతోనే ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెడుతోందని, జై పాలస్తీనా అన్నవారిని తమ వెంట తిప్పుకుంటోందన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందన్నారు. అజారుద్దీన్‍కు మంత్రి పదవి బీసీ కోటాలో ఇచ్చారా లేక మైనార్టీ కోటాలో ఇచ్చారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

Latest