Mahaa Daily Exclusive

  కేటీఆర్..రాజీనామాకు సిద్ధంగా ఉండు.. షేక్‌పేట రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

Share

  • కేటీఆర్..రాజీనామాకు సిద్ధంగా ఉండు
  • వైట్ ఛాలెంజ్ విసిరి పారిపోయాడు కాదు
  • 30 వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు పక్కా
  • అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్‌రెడ్డికి ఇబ్బందేంటీ
  • కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానని మీరు అనలేదా?
  • లోకసభ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేయకుంటే మోదీ ప్రధాని అయ్యే చాన్స్ లేదు
  • ఎమ్మెల్యే చనిపోతే ఏకగ్రీవం కాకుండా ఉపఎన్నికకు నాంది పలికింది కేసీఆరే
  •  షేక్‌పేట రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

హైదరాబాద్, మహా: నవీన్‌ యాదవ్‌ను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ ఎందుకు కట్టకూడదో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని, కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరితే ఎందుకు స్పందించడం లేదనంనారు. తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని, మొదటి నుంచి నేను సెక్యులర్‌ భావాలు ఉన్న వ్యక్తినన్నారు. బుధవారం షేక్ పేట డివిజన్ పారా మౌంట్ కాలనీ రోడ్ షో లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు అనేక అవకాశాలు కల్పించింది. కొడంగల్‌లో నేను 3 సార్లు గెలవడానికి మైనార్టీల సహకారం ఉంది. 20 నెలల కాంగ్రెస్‌ పాలనలో మైనార్టీలకు ఇబ్బందులు లేకుండా చూశాం. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఎలా ఇచ్చారని కిషన్‌రెడ్డి అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వొద్దో.. కిషన్‌రెడ్డి చెప్పాలి. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్‌రెడ్డికి ఏం ఇబ్బంది’ అని సీఎం ప్రశ్నించారు.

‘జూబ్లీ హిల్స్‌లో సెంటిమెంటా లేక డెవలప్మెంటా అన్నది ప్రజలు ఆలోచించాలి. సెంటిమెంట్ పేరుతో ఓటు అడిగే హక్కు కేసీఆర్ కు లేదు.. పీజేఆర్ చనిపోయినప్పడు సెంటిమెంట్ లేదని కేసీఆర్ అన్నాడు.. ఎమ్మెల్యే చనిపోతే ఏకగ్రీవం కాకుండా ఉపఎన్నిక లకు నాంది పలికింది కేసీఆర్. పీజేఆర్ కుటుంబ సభ్యులను కేసీఆర్ ఆనాడు అవమానించాడు. పీజేఆర్ విగ్రహాం ముందు ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాలి. బీఆర్‌ఎస్ నాయకులు బెంజ్ కారు వదిలి ఆటో లో తిరుగుతూ సమస్య ల గురించి మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్‌లో సమస్యలకు కారణం బీజేపీ, బీఆర్ఎస్. మా ప్రభుత్వం జూబ్లీ హిల్స్‌లో 3 నెలలో 400 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టింది. 10 ఏళ్లలో కేసీఆర్ ఏమీ ఇవ్వలేదు.. ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతాడు. జూబ్లీ హిల్స్ లో 2 లక్షల 39 వేల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం. రాబోయే రోజులలో జూబ్లీహిల్స్‌లో 4000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. కాళేశ్వరం అవినీతి పైన సీబీఐ విచారణ కోరితే మోదీ పట్టించు కోవడం లేదు. కేసీఆర్, కేటీఆర్ ని ఎందుకు బొక్కలో వేయడం లేదని మోదీని కిషన్ రెడ్డి నిలదీయడం లేదు.

సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్‌కు అలవాటుగా మారింది. గతం లో నేను వైట్ ఛాలెంజ్ విసిరితే రాకుండా పారిపోయాడు. కంటోన్మెంట్‌లో 4000 కోట్ల అభివృద్ధి పనులు జరగలేదు,నిరూపిస్తే రాజీనామా చేస్తా అని కేటిఆర్ సవాల్ విసిరాడు. కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 5000 కోట్ల జీవోలు చూపిస్తే కేటీఆర్ పారిపోయాడు. కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండు.. నవీన్ యాదవ్ విజయం కోసం ఎంఐఎం నేతలు కష్ట పడి పని చేస్తున్నారు. నవీన్ యాదవ్ కు మొదట ఎంఐఎం ఎమ్మెల్యే ఇచ్చింది. 30 వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. సిరాజ్ కోసం అన్ని నిబంధనలు పక్కన పెట్టి డీఎస్పీగా అవకాశం ఇచ్చాం. నిక్కత్జరీన్‌ను కూడా డీఎస్పీగా నియమించాం. అజరుద్దీన్‌ను మంత్రిని చేశాం. అజరుద్దీన్‌ను మంత్రిని చేస్తే కిషన్ రెడ్డికి ఎం ఇబ్బంది.. ముస్లిం అంటే కాంగ్రెస్..కాంగ్రెస్ అంటే ముస్లిం. మా ప్రభుత్వంలో హిందూ, ముస్లిం అంతా ఒక్కటే. మేం ఎలాంటి తారతమ్యం చూపించం. లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించక పోతే మోదీ ప్రధాని అయ్యే అవకాశం లేదు. బీజేపీ. బీఆర్ఎస్ పేరుతో జూబ్లీహిల్స్‌లో ఓటు అడుగుతుంది. కాళేశ్వరంపైన సీబీఐ విచారణ కోరితే 24 గంటల్లో కేసీఆర్‌కు చర్లపల్లి జైలు లో చిప్పకూడు తినిపిస్తానని కిషన్ రెడ్డి అన్నాడు. విచారణకు ఆదేశించి 3 నెలలు అయినా ఎందుకు పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్  చేశారు

Latest