Mahaa Daily Exclusive

  కవిత.. మీ నాన్న జాగ్రత్త!కేటీఆర్‌కు వావి వరసల్లేవు.. నువ్వే చూసుకో….

Share

  • కవిత.. మీ నాన్న జాగ్రత్త!
  • కేటీఆర్‌కు వావి వరసల్లేవు.. నువ్వే చూసుకో
  • చిన్నా, పెద్దా, ముసలి ముతక అనే తేడా లేదు
  • గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని వారి తల్లే చెప్పిన మాట
  • దానిపై రేవంత్‌కు దమ్ముంటే గోపీనాథ్ చావుపై విచారణ జరిపించాలి
  • ముస్లింల టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా కానీ పెట్టుకోను
  • బీజేపీ బోరబండ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా: ఎన్నికలు రాగానే ముస్లింల టోపీ పెట్టుకోవడం కాంగ్రెస్‌ నేతలకు అలవాటు అయిపోయిందని, ఎక్కడ ఎన్నికలు వచ్చినా ముస్లిం టోపీ పెట్టుకోవడం, పాకిస్తాన్‌ను పొగడటం వంటివి చేస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన బోరబండ సభలో ఆయన మాట్లాడారు. టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా అని హాట్ కామెంట్స్ చేశారు. తాను హిందువునని, టోపీ పెట్టి, దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపర్చనన్నారు. దివంగత మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని, గోపీనాథ్ తల్లి చెప్పిన మాట ఇదని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపీనాథ్ చావుపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు వావి వరసల్లేవు…. చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడా లేనే లేదని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన సీఎం పదవి కోసం ఏమైనా చేసే రకమన్నారు. కవిత.. మీ తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకో అంటూ సూచించారు. రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగలు పీక్క తినేటోడు వచ్చిండన్నారు.

ఓవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు..
ఎంఐఎం నాయకులు చైన్ స్నాచర్స్ వాళ్లతో జాగ్రత్త అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. పొరపాటున కాంగ్రెసోళ్లు గెలిస్తే ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళ సూత్రం కూడా గుంజుకుపోతారు జాగ్రత్త అంటూ వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే రూ.9 వేల కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరినట్లు? అని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అంటూ కాంగ్రెస్ ను నిలదీశారు. లక్ష ఓట్ల కోసం ఓవైసీ సంకుతున్న కాంగ్రెస్ అని అన్నారు. రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఓవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లని ఫైర్ అయ్యారు. టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డి ని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొచ్చిండు. అజహరుద్దీన్ చేత వక్రతుండ అని గణేష్ మంత్రం చదవించే దమ్ముందా?. ఓవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా? అంటూ ప్రశ్నించారు. జూబ్లిహిల్స్ హిందువులారా… 70 శాతం ఓట్ల సత్తా ఏందో చూపించండని బండి సంజయ్ పిలుపినిచ్చారు

Latest