Mahaa Daily Exclusive

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక …  అందరికీ కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్…

Share

హైదరాబాద్, మహా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “గత నెల రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయభ్రాంతులకు గురిచేసినా బయటకు వచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని ఆయన పేర్కొన్నారు

Latest