Mahaa Daily Exclusive

  నేను మంత్రి పదవి కోరలేదు … పార్టీ అప్పగించే బాధ్యతను నిర్వర్తిస్తా:టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్

Share

  • నేను మంత్రి పదవి కోరలేదు
  • పార్టీ అప్పగించే బాధ్యతను నిర్వర్తిస్తా
  • పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు చోరీ వల్ల బీజేపీకి సీట్లు
  • ఢిల్లీలో బాంబ్ బ్లాస్టింగ్ కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యం
  • టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్

హైదరాబాద్, మహా: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాను చాలా సంతోషంగా ఉన్నానని, మంత్రి పదవి కావాలని తాను ఎక్కడ అడగడం లేదని కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్ వివరణ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పార్టీ లో నేను ఆర్గనైజషన్ నుంచి వచ్చాను. పార్టీ అప్పగించే బాధ్యతను నిర్వర్తిస్తాను. నేను మంత్రి వర్గంలోకి వెళ్లాలని ఆరాటపడటం లేదు. నాకు సీఎంతో పాటు మంత్రివర్గం మొత్తం పూర్తిగా సహకారం అందిస్తున్నారు’ అని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.

కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో..
సీఎం రేవంత్ రెడ్డి, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని టీపీసీసీ చీఫ్ స్పష్టతనిచ్చారు. తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగిందన్న మహేష్ కుమార్ గౌడ్.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ చేసి ఎక్కువ సీట్లు గెలిచిందన్నారు. నిజామాబాద్‌లో ఓటు చోరీ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఓల్డ్ సిటీలో ఆధారాలను ఫిరోజ్ ఖాన్ బయట పెట్టాడని, ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తుందనుకోవడం లేదని కూడా టీపీసీసీ చీఫ్ చెప్పారు. ‘ఫిరాయింపుల వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉంది. దానం నాగేందర్ మా పార్టీ విధానాలు నచ్చి మాతో ప్రయాణిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో ఆ పార్టీ నేతలే చెప్పాలి. ఇంపార్టెంట్ వ్యక్తులకు కేసీఆర్ ఫోన్ లు చేసినట్లు మాకు సమాచారం ఉంది. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం దురదృష్టకరం. ఢిల్లీలో బాంబ్ బ్లాస్టింగ్ కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యమని ఆయన అన్నారు.

Latest