Mahaa Daily Exclusive

  మణుగూరులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి..

Share

మణుగూరులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి..

మణుగూరు, మహా :
మణుగూరు మండలం శేషగిరి నగర్‌కు చెందిన వృతిక్‌ (20) ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.పినపాక– మణుగూరు సరిహద్దులోని చిక్కుడుగుంట భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో ఉదయం సుమారు 6:15 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సమాచారం మేరకు స్కూటీపై ముగ్గురు యువకులు ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పి కల్వర్ట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృతిక్‌కు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. అదే స్కూటీపై ఉన్న మరో ఇద్దరు యువకులు కూడా తీవ్రంగా గాయపడగా, స్థానికులు అంబులెన్స్‌ ద్వారా క్షతగాత్రులను మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.