Mahaa Daily Exclusive

  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరాలు…

Share

  • మంగాపురం తండా అభివృద్ధికి రూ. 7.65 కోట్లు
  • బుద్దారం గ్రామాభివృద్ధికి రూ. 12.24 కోట్లు
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరాలు
  • నేలకొండపల్లిలో పర్యటన.. సీసీ రోడ్ల శంకుస్థాపన, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఖమ్మం, మహా: రాష్ట్రంలో ప్రతి పేదింటికి వెలుగులు తెచ్చే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన నేలకొండపల్లి మండలంలో పర్యటించి మంగాపురం తండా, బుద్దారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంగాపురం తండాలో రూ. 30 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి, గత 20 నెలల్లో రూ. 57 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. మంగాపురం–నాచేపల్లి మధ్య రూ 4.50 కోట్లతో బీటీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని, రావిగూడెం–మంగాపురం తండా మధ్య రూ. 2.22 కోట్లతో బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయని వివరించారు. అదనంగా 7 లక్షలతో అంగన్‌వాడీ భవనం నిర్మాణం కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం మంగాపురం తండా అభివృద్ధికి రూ. 7.65 కోట్ల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు.

రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉంది..
బుద్దారం గ్రామంలో రూ. 26 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు నిర్మించామని, నేలకొండపల్లి–గండ్రాయి బీటీ రోడ్డు పై రూ.7 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పూర్తి చేశామని చెప్పారు. గత 22 నెలల్లో బుద్దారం గ్రామాభివృద్ధికి మొత్తం రూ12.24 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. రెండు లక్షల వరకు పంట రుణమాఫీ పూర్తయిందని, రైతులకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ 500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కింద 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు.

మూడు విడతల్లో ఇందిరమ్మ ఇండ్లు..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్‌లో సన్నబియ్యం సరఫరా, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం పేదల గృహ నిర్మాణ పథకాలను విస్మరించిందని విమర్శించిన మంత్రి, ప్రజా ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మూడు విడతల్లో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 58 మంది లబ్ధిదారులకు రూ. 20.29 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
============

Latest