మహా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. మొదటి నుంచీ ఆధిక్యం ప్రదర్శించిన కాంగ్రెస్ చివరకు జూబ్లీహిల్స్‌ను కైవసం చేసుకుంది.
2009లో రాజకీయంలో అడుగుపెట్టిన నవీన్ యాదవ్ 16 ఏళ్ల నిరీక్షణకు ఇప్పుడు ఫలితం లభించింది. ఎంఐఎంలో ప్రస్థానం ప్రారంభించిన నవీన్ యాదవ్, 2023లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని కోల్పోకుండా తన శాయశక్తులా కష్టపడి జూబ్లీహిల్స్‌ను కాంగ్రెస్ ఖాతాలో వేశారు. నవీన్‌యాదవ్ సామాజిక కార్యక్రమాల్లోనూ ముందున్నాడు. నవ యువ ఫౌండేషన్‌ను స్థాపించి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నవీన్ యాదవ్ ప్రొఫైల్ :
పేరు : వల్లాల నవీన్‌యాదవ్
తండ్రి పేరు : వి.చిన్నశ్రీశైలంయాదవ్
పుట్టిన తేదీ : 17-11-1983 (42 సంవత్సరాలు)
భార్య : వర్షయాదవ్
కుమారుడు : అన్ష్‌యాదవ్
విద్యార్హతలు : బీ.ఆర్క్ (ఆర్కిటెక్చర్)
వృత్తి : ఆర్కిటెక్ట్, స్థిరాస్తి వ్యాపారం
స్వస్థలం : యూసుఫ్‌గూడ, హైదరాబాద్






