హైదరాబాద్, మహా:రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పలువురు అధికారులకు తాజాగా పోస్టింగులు లభించగా.. మరికొంతమంది బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీల వివరాలు..
1. దేవేంద్ర సింగ్ చౌహాన్: అదనపు డీజీపీ (మల్టిజోన్-II) నుంచి డీజీపీ కార్యాలయం (వ్యక్తిగతం)కు బదిలీ
2. పరిమల హనా నూతన్ జాకబ్: సంయుక్త కమిషనర్ (హైదరాబాద్ నగరం) నుంచి సీఐడీ ఉప ఐజీగా బదిలీ
3. చేతన మైలబత్తుల: మహిళా భద్రతా విభాగం ఎస్పీ నుంచి ఉప సంచాలకులు, ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీసు అకాడమీ (టీజీపీఏ)కి బదిలీ
4. నారాయణరెడ్డి: వికారాబాద్ ఎస్పీ నుంచి మహేశ్వరం జోన్‌కు ఉప కమిషనర్ (డీసీపీ)గా బదిలీ
5. పద్మజ: ఉప కమిషనర్ (మల్కాజిగిరి) నుంచి ఎస్పీ (పరిపాలన), మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగంకు బదిలీ
6. పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపత్రావ్: ఎస్పీ (సీఐడీ) నుంచి నాగర్‌కర్నూల్ ఎస్పీగా బదిలీ
7. ఖరే కిరణ ప్రభాకర్: జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ నుంచి హైదరాబాద్ ఉప కమిషనర్ (దక్షిణ మండలం)కు బదిలీ
8. చెన్నూరి రూపేశ్: ఎస్పీ (తెలంగాణ) మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం నుంచి ఉప కమిషనర్ (ఎస్ఎం & ఐటీ), హైదరాబాద్‌కు బదిలీ
9. శబరీశ్: ములుగు ఎస్పీ నుంచి మహబూబాబాద్ ఎస్పీగా బదిలీ
10. నితికా పంత్: కమాండెంట్ (రెండవ బెటాలియన్) నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా బదిలీ
11. గిరిధర్: వనపర్తి ఎస్పీ నుంచి మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి ఎస్పీ (తెలంగాణ)గా బదిలీ
12. స్నేహా మెహ్రా: ఉప కమిషనర్ (దక్షిణ మండలం) నుంచి వికారాబాద్ ఎస్పీగా బదిలీ
13. వైభవ్ గైక్వాడ్: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు ఉప కమిషనర్ (డీసీపీ)గా నియామకం
14. కేకన్ సుధీర్ రామనాథ్: ములుగు ఎస్పీగా నియామకం
15. సిరిసెట్టి సంకీర్త్: గవర్నర్ సహాయ అధికారి (ఏడీసీ) నుంచి జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా బదిలీ
16. పాటిల్ కాంతిలాల్ సుభాశ్: గవర్నర్ సహాయ అధికారి (ఏడీసీ)గా నియామకం
17. బి.రామ్ రెడ్డి: ఎస్పీ (సీఐడీ) నుంచి పెద్దపల్లి ఉప కమిషనర్ (డీసీపీ)గా బదిలీ
18. సి.శ్రీధర్: ఎస్పీ (ఇంటెలిజెన్స్) నుంచి మల్కాజిగిరి ఉప కమిషనర్ (డీసీపీ)గా బదిలీ
19. అవినాశ్ కుమార్: సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్‌డీపీఓ) నుంచి భద్రాద్రి కొత్తగూడెంకు అదనపు ఎస్పీగా బదిలీ
20. కాజల్: సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్‌డీపీఓ) నుంచి ఆదిలాబాద్‌కు అదనపు ఎస్పీగా బదిలీ
21. కంకనాల రాహుల్ రెడ్డి: సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్‌డీపీఓ) నుంచి భువనగిరికి అదనపు ఎస్పీగా బదిలీ
22. శేషాద్రిని సురుకొంటి: సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్‌డీపీఓ) నుంచి రాజన్న సిరిసిల్లాకు అదనపు ఎస్పీగా బదిలీ
23. శివం ఉపాధ్యాయ: సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్‌డీపీఓ) నుంచి ములుగుకు అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ
24. రాజేశ్ మీనా: భైంసా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్‌డీపీఓ)గా నియామకం
25. మౌనికా: సహాయ ఎస్పీ (ఏఎస్‌పీ) నుంచి ఆదిలాబాద్‌కు అదనపు ఎస్పీ (పరిపాలన)గా బదిలీ
26. మనన్ భట్: సహాయ ఎస్పీ (ఏఎస్‌పీ) గ్రేహౌండ్స్ నుంచి ఏటూరునాగారం సహాయ ఎస్పీ (ఏఎస్‌పీ)గా బదిలీ
27. పతిపాక సాయి కిరణ్: సహాయ ఎస్పీ (ఏఎస్‌పీ) గ్రేహౌండ్స్ నుంచి నిర్మల్‌కు సహాయ ఎస్పీ (ఏఎస్‌పీ)గా బదిలీ
28. రుత్విక సాయి కొట్టే: సహాయ ఎస్పీ (ఏఎస్‌పీ) గ్రేహౌండ్స్ నుంచి వేములవాడ సహాయ ఎస్పీ (ఏఎస్‌పీ)గా బదిలీ
29. యాదవ వసుందర ఫౌరెబి: సహాయ ఎస్పీ (ఏఎస్‌పీ) నుంచి సత్తుపల్లి (ఖమ్మం)కు సహాయ ఎస్పీ (ఏఎస్‌పీ)గా బదిలీ
30. ఎస్. శ్రీనివాస్: నిరీక్షణ జాబితా నుంచి ఎస్పీ (తెలంగాణ ట్రాన్స్‌కో)లో నియామకం
31. డి. సునీత: నిరీక్షణ జాబితా నుంచి వనపర్తి ఎస్పీగా బదిలీ
32. కె. గుణశేఖర్: నిరీక్షణ జాబితా నుంచి రాచకొండ ఉప కమిషనర్ (నేరాలు)కు బదిలీ








