- ప్రచారానికి అనుమతి ఇవ్వలేం
- టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌కి పోలీసులు షాక్
- భద్రతా కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమని స్పష్టం
తమిళనాడు, మహా: కరూర్ దుర్ఘటన తర్వాత పునః ప్రారంభించ తలపెట్టిన తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. డిసెంబర్ 4న సేలంలో జరగాల్సిన ఈ కార్యక్రమం కోసం సమర్పించిన చేసిన దరఖాస్తును తిరస్కరించారు. ఆ తేదీల్లో భద్రతా కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమని మొదట పోలీసులు తెలిపారు. పార్టీకి ఇచ్చిన లేఖలో మాత్రం భద్రతా సిబ్బంది లేకపోవడం, ఎంత మంది ప్రజలు హాజరవుతారనే కచ్చితమైన వివరాలు లేకపోవడం వంటి అంశాలను కారణాలుగా చూపారు. భవిష్యత్తులో విజయ్ ప్రజా సమావేశాలకు అనుమతి కోరినట్లయితే కార్యక్రమం తేదీకి నాలుగు వారాల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీవీకే ప్రచారాన్ని ప్రత్యామ్నాయ తేదీల్లో నిర్వహించుకునేందుకు అనుమతి కోసం త్వరలోనే దరఖాస్తు చేసుకుంటామని పార్టీ వర్గాలు తెలిపాయి. సేలం తర్వాత ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లో కూడా విజయ్ ప్రచారం చేయాలని యోచిస్తున్నారు.
======================








