Mahaa Daily Exclusive

  బీదర్–మహేశ్వరం విద్యుత్ లైన్ వివాదం….

Share

బీదర్–మహేశ్వరం విద్యుత్ లైన్ వివాదం.
* రైతులకు అన్యాయం జరుగకుండా చూడాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు ఎంపీ రవిచంద్ర సూచనలు.

రంగారెడ్డి,మహా.

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల రైతుల భూములకు నష్టం కలిగించే అవకాశం ఉన్న బీదర్ , మహేశ్వరం 765 కెవి హై టెన్షన్ విద్యుత్ లైన్ అంశంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లు అత్యంత చురుకుగా వ్యవహరిస్తున్నారు. రైతుల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని, వారి విలువైన భూములకు, పంట పొలాలకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సెంట్రల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులను గట్టిగా కోరారు.
ముఖ్యంగా, రైతులు కేటీఆర్ సూచన మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి విన్నవించుకున్న అనంతరం, మంత్రి ఆదేశాల మేరకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో, కార్పొరేషన్ సీజీఏం బిపిన్ బీహారీ రథ్ తదితర సీనియర్ అధికారులు ఆదివారం హైదరాబాద్‌లోని ఎంపీ రవిచంద్ర క్యాంప్ కార్యాలయంలో సుమారు మూడు గంటల పాటు ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, రైతుల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు, జైపాల్ యాదవ్ లు విద్యుత్ లైన్ మ్యాపులను పరిశీలించి, రైతులకు అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, సూచనలు చేశారు. రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని, వారి ఆవేదనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సీజీఏం బిపిన్ బీహారీ రథ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Latest