- సర్కార్ దుర్మార్గమైన ఆలోచన మానుకోవాలి..?
- రేగడి దోస్వాడ అసైన్డ్ భూమి రైతులకు శాశ్వత పట్టాలి ఇవ్వాలి….
- పేదల భూములు లాక్కోవాలని చూస్తే సిపిఎం ఊరుకోదు
- సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కడిగాళ్ల భాస్కర్
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
షాబాద్ మండల పరిధిలోని రేగడి దోసాడ, మక్తగూడ గ్రామాల అసైన్డ్ భూమి పేద రైతులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ళ భాస్కర్ మాట్లాడుతూ… ప్రభుత్వం పేదల భూములు లాక్కొని, బడా పెట్టుబడిదారులకు ఇవ్వాలని దుర్మార్గంగా ఆలోచిస్తుందని దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అసైన్డ్ భూములకు శాశ్వత పట్టాలిస్తామని హామీ ఇచ్చారని, వెంటనే 102 సర్వే నంబర్లో రైతులందరికీ శాశ్వత పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేనెంబర్ 102లో గల భూమి పచ్చని పంట పొలాలు ఉన్నాయని, వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పేద రైతులందరూ పొలాలలో బోర్లు వేసుకొని సాగు చేసుకుంటున్నారు. పశుపోషణ ద్వారా సమాజానికి పాల ఉత్పత్తులు అందిస్తున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ఆలోచనను విరమించుకోవాలని లేనిపక్షంలో ఆందోళన పోరాటాల నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్, తాజా మాజీ సర్పంచ్ ఎలుకట్టే రాములు, మాజీ ఉప సర్పంచ్ గుండాల శ్రీనివాస్, గ్రామ పెద్దలు, యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.







