- సోనియా,రాహుల్‌కు షాక్
- నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్‌ఐఆర్
- మరో ఆరుగురిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు
ఢిల్లీ, మహా: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలకు అనుహ్య పరిణామం ఎదురైంది. ఢిల్లీ ఈవోడబ్ల్యూ కాంగ్రెస్ అగ్రనేతలపై సహా మరికొందరిపై కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ఎఫ్‌ఐఆర్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో ఆరుగురిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలతోపాటు యంగ్ ఇండియా సంస్థ కూడా కుట్ర, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. వీరందరూ కుట్రపూరితంగా కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆసులపై అధికారాన్ని పొందారని ఆరోపించింది. కాగా మోతీలాల్ వోరా 2020లో మృతిచెందగా.. ఆస్కార్ ఫెర్నాండెజ్ 2021లో మృతిచెందారు.
నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకోగా.. రాహుల్, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్ ఇండియా రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి ఏజేఎల్‌ను సొంతం చేసుకొన్నట్లు అభియోగపత్రంలో ఈడీ పేర్కొంది. ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తామని, పదవులకు ఎంపికచేస్తామని, వ్యాపారాలకు రక్షణ కల్పిస్తామంటూ వివిధ వ్యక్తుల నుంచి పార్టీ సీనియర్ నేతల ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డారని తెలిపింది.







