Mahaa Daily Exclusive

  మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులో పాల్గొన్న ఎమ్మెల్యే బేబీ నాయన..!

Share

విజయనగరం జిల్లా,మహా:

తెలుగుదేశం పార్టీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికై ముందగు వేసి, సరికొత్త విధానాలతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంపొందించేలా చర్యలు చేపట్టారు.. అందులో భాగంగానే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులు ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాలలో బోధనా విధానాలు అమలు చేస్తున్న తీరు,పిల్లల చదువులలో పురోగతిని గురించి వివరించేలా ఒక ప్రణాళికను రూపొందించారు.బొబ్బిలి నియోజకవర్గం,బాడంగి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం నాడు నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులో శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు బేబీ నాయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడు తూ.. ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ ఉపాధ్యాయులు ఉన్నారని,ఆయన దగ్గర క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని,చదువుకున్న గురువులు,పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అలాగే,తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని వారిని చదివిస్తున్న సంగతి పిల్లలకు గుర్తుచేస్తూ,చెడు మార్గాలవైపు మరలకుండా తల్లిదండ్రుల మాటకు గౌరవిస్తూ చదువుకోవాలని సూచించారు.. అనంతరం,విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే బేబీనాయన భోజనం చేశారు.బాడంగి జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థి,నాగిరెడ్డి కృష్ణమూర్తి తెంటువలస ప్రస్తుతం శ్రీకాకుళంలో సూపరింటెండెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు, ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి, ఆయన చదువుకునే రోజుల్లో విద్యావిధానం గురించి విద్యార్థులకు వివరించారు.ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Latest