- దేశభక్తి, సంస్కృతి, నాణ్యమైన విద్యకు నిలయాలు నరస్వతీ విద్యా మందిరాలు
- మాజీ ఎంపీ బీబీ పాటిల్
- తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న విద్యార్థులు
హైదరాబాద్, మహా : దేశభక్తి సంస్కృతి, నాణ్యమైన విద్యనందించడంలో సరస్వతీ విద్యా మందిరాలు ముందున్నాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. పాతబస్తీ కందికల్ గేట్ శ్రీ సరస్వతీ విద్యా ముందిర్ పూర్వ విద్యార్థుల, ఆచార్యుల మహా నమ్మేళనం ఆదివారం శ్రీ చిత్రగుప్త దేవాలయం అవరణలో గల పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా హాజరైన పాటిల్ మాట్లాడుతూ 1982లో నానాజీ దేశముఖ్ ఆధ్వర్యంలో గోరఖ్ పూర్ లో తొలి పాఠశాల ప్రారంభమైందన్నారు. గత 78 ఏళ్ళుగా సరస్వతీ విద్యా మందిరాలు సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన విద్యనిందిస్తున్నాయన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు తమ పాత్రను పోషించటం హర్షణీయమన్నారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళుతున్న నిర్వాహకులకు మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో బాలాగ్సి ఫార్మానూటికల్ లిమిటెడ్ ఎండీ మీనోషి మహేశ్వరి, విద్యాభారతి క్షేత్ర సంఘటనా కార్యదర్భి లింగం సుధాకర్ రెడ్డి, శ్రీసరస్వతీ విద్యా పీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, తెలంగాణ పూర్వ విద్యార్ధి పరిషత్ ప్రాంత కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్ తదితరులు హాజరై ప్రసంగించారు. అనంతరం పూర్వ ఆచార్యులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్సి కొక్కొండ ఆశీష్ కోశాధికారి చెగూరి పరమేష్ పాఠశాల నమితి అధ్యక్షులు కటకం ప్రసన్నకుమార్. ప్రబంధకారిణి అధ్యక్షులు బీవీ నారాయణ దరగ్, ప్రధానాచార్యులు ఎన్.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.








