Mahaa Daily Exclusive

  ఒడిశాలో మరో ఎన్‌కౌంటర్‌

Share

ఒడిశాలో మరో ఎన్‌కౌంటర్‌

తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత గణేశ్‌ ఉయికే హతం

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న గణేష్

ఎన్ కౌంటర్ పై చ్వీట్ చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

భువనేశ్వర్, మహా : మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. వరుస ఎన్ కౌంటర్లతో సతమతమవుతున్న పార్టీకి ఓడిషాలో జరిగిన తాజా ఎన్ కౌంటర్ మరింత దెబ్బతీసింది. ఒడిశాలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికేతో పాటు మరో ఐదుగురు మృతి చెందారు. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన గణేశ్‌ ఉయికే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే ప్రాణాలు కోల్పోయాడు. సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్న గణేశ్ ఉయికే కీలక నేతగా ఉన్నారు. ఆయన తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలానికి చెందిన వ్యక్తి. ఆయనపై రూ .1.1 కోట్ల రివార్డు ఉంది. ఒడిశాలో కేంద్రంగా కీలకమైన కార్యకలాపాలకు నాయకత్వం నేతగా గణేశ్ ఉయికేకు పేరుందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

అర్ధరాత్రి కూడా కాల్పులు

బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మ అడవిలో బుధవారం రాత్రి భద్రతా బలగాలతో కాల్పులు జరిగాయి. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అయితే గురువారం ఉదయం చకపాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో తాజాగా కాల్పులు జరిగాయి. ఇందులో ఉయికేతో సహా మరికొందరు మావోయిస్టులు మరణించారని పోలీసులు చెప్పారు. ఈ కాల్పులు 69 ఏళ్ల గణేస్ ఉయికే (పాకా హన్మంతు) చనిపోయాడు. ఇతనికి రాజేష్ తివారీ, చామ్రు, రూపా అనే పేర్లు కూడా ఉన్నాయి. నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని పుల్లెంల గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ కాల్పుల్లో చనిపోయిన మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఒడిశాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ఆపరేషన్లలో ఇది ఒకటని పోలీసులు చెబుతున్నారు. “ఆపరేషన్ లో పాల్గొన్న భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని తాము బలంగా నిశ్చయించుకున్నాము” అని ఓ పోలీస్ అధికారి తెలిపారు.

ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా. ఒడిశా పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ నకు చెందిన 20, సీఆర్పీఎఫ్ కు చెందిన ఇద్దరు, బీఎస్ఎఫ్ కు చెందిన ఒక బృందాలతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయని పేర్కొన్నారు. గురువారం వివిధ ప్రాంతాల్లో అనేక కాల్పులు జరిగాయి. ఆ తర్వాత మావోయిస్టులకు చెందిన నలుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. రెండు ఇన్సాస్ రైఫిల్స్, 303 రైఫిల్స్ ను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఒడిశా కంధమాల్‌ ఎన్‌కౌంటర్‌పై అమిత్‌ షా ట్వీట్

ఒడిశా లోని కందహార్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. గురువారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్‌ హతమైనట్లు ప్రకటించారు. నిర్ధేశిత లక్ష్యం ప్రకారం 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని మరోసారి అమిత్‌ షా పునరుద్ఘాటించారు. ఒడిశా దాదాపు మావోయిస్టు రహిత రాష్ట్రమైందన్నారు.

Latest