Mahaa Daily Exclusive

  నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం…

Share

  • నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం
  • హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొట్టిన క్వాలిస్

 

నంద్యాల, మహా : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ వాహనం రోడ్డు డివైడర్ ను కొట్టి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్వాలిస్ వాహనంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. గాయపడ్డవారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తోంది. ఇక క్వాలిస్ వాహనం తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రమోద్ కుమార్ పరిశీలించారు. మృతులంతా క్యాటరింగ్ సిబ్బంది అని యాత్రకు వెళ్లే వారి కోసం వంట చేసేందుకు వెళ్లిన వారని తెలిపారు. మృతులు గుండెరావు, శ్రవణ్, నరసింహ, బన్నీగా గుర్తించామన్నారు. అలాగే, గాయపడిన వారు శివసాయి, సిధార్థలు.. హైదరాబాద్ నిజాం కాలేజీలో గుండెరావు కుమారులు సిధార్థ, శివసాయి చదువుతున్నారు. గత 15 రోజులుగా యాత్ర చేస్తున్న బస్సుకు వంట చేసేందుకు గుండెరావు టీం వెళ్లిందని డీఎస్పీ తెలిపారు.

దిగ్భ్రాంతి వ్యక్తి చేసిన అఖిల ప్రియ

ఈ రోడ్డు ప్రమాదంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

Latest